గురువుకు ఎమ్మెల్యే పాదాభివందనం

MLA salutes the teacher

Sep 5, 2024 - 17:25
Sep 5, 2024 - 17:26
 0
గురువుకు ఎమ్మెల్యే పాదాభివందనం
పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మితో భరోసా
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నా తెలంగాణ, షాద్ నగర్: తాను ఎంత ఎత్తుకు ఎదిగినా అందుకు కారణం గురువులేనని షాద్​ నగర్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు పాదాభివందనం చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్​ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. తన చిన్ననాటి తనంలో గురువులు బోధించిన పాఠాలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. వారి బోధన దైవం కంటే మిన్నగా ఉందన్నారు. గురువులను సన్మానించుకోవడం, గౌరవించుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే వీర్లపల్లి తెలిపారు. 
 
కళ్యాణలక్ష్మితో పేదలకు భరోసా..

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కేశంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన 30 కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, మాజీ జడ్పిటిసిలు శ్యామ్ సుందర్ రెడ్డి, తాండ్ర విశాలశ్రవణ్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, కేశంపేట తహసిల్దార్ ఆజంఅలీ, ఆర్.ఐ నివేదిత, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గూడ వీరేశం, నాయకులు సురేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గిరియాదవ్, భాస్కర్ గౌడ్, రావుల పెంటయ్య, దర్శన్, తైదపర్వతాలు, కోడూరు రాములు, రమేష్, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.