కళాశాల అభివృద్ధికి విరాళాల సేకరణ

Collection of donations for the development of the college

Sep 5, 2024 - 18:30
 0
కళాశాల అభివృద్ధికి విరాళాల సేకరణ
తొలి సమావేశంలోనే రూ. 25 లక్షలు
దాతలను సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి
కళాశాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప రెడ్డి
నా తెలంగాణ, షాద్ నగర్: జూనియర్​ కళాశాల అభివృద్ధికి షాద్​ నగర్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ నడుం బిగించారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి సమావేశంలోనే రూ. 25 లక్షలు విరాళాల రూపంలో లభించడంతో సంతోషం వ్యక్తం చేశారు. దాతలకు షాలువా కప్పి సన్మానించారు. 
 
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి చెరో అయిదు లక్షల రూపాయల చొప్పున విరాళాలు ప్రకటించడమే గాక కళాశాల నిర్మాణం జరిగే వరకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.
 
నాయకులు ఎం.డి. ఖాదర్​ గోరి, మహ్మద్​ ఇబ్రహీంలు చెరో లక్ష రూపాయలను ప్రకటించారు. 
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. కళాశాల నిర్మాణ బాధ్యతను అంకిత భావంతో పూర్తి చేయగల సమర్థత శంకర్ కు ఉందన్నారు. సీఎంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో తాండ్ర కాశీనాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి, తాండ్ర విశాలశ్రావణ్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, చెన్నయ్య, ఆగిర్ రవికుమార్ గుప్తా, చెంది తిరుపతి రెడ్డి, రఘు, రామారావు, మహమ్మద్ ఇబ్రహీం, ఖాదర్ గోరి, పురుషోత్తం రెడ్డి, సురేష్ రెడ్డి, అందెమోహన్, జమ్రుత్ ఖాన్, జాంగారి రవి, లింగారెడ్డి గూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు.