యోగాతోనే మెరుగైన జీవనం కలెక్టర్ అభిలాష అభినవ్

Abhilash Abhinav, collector, lives better with yoga

Jun 21, 2024 - 17:01
 0
యోగాతోనే మెరుగైన జీవనం కలెక్టర్ అభిలాష అభినవ్

నా తెలంగాణ, నిర్మల్: పనుల ఒత్తిడి, బాధ్యతలతో ఉరుకులు, పరుగులతో జీవితం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో యోగ సాధనతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఆయుష్ విభాగం, వశిష్ట యోగా సంఘటన్ సంయుక్తంగా  స్థానిక దివ్య గార్డెన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​ అభిలాష మాట్లాడుతూ.. పనుల ఒత్తిడి, సమయం సమయాభావం వంటి పలు కారణాలతో మన జీవన విధానం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. జీవన విధానంలో మార్పులు చేసుకొని యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని స్వంతం చేసుకోవచ్చారు. కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణలో తలమునకలై ఉన్నప్పటికీ మన ఆరోగ్య పరిరక్షణ కోసం కనీసం ఒక గంట పాటు యోగా, నడక వంటి వాటికి కేటాయించాలని కోరారు. ఇందువల్ల మన జీవనశైలిలో ఎదురయ్యే ఒత్తిడులను అధిగమించ వచ్చని అన్నారు. ఎన్నో శారీరక, మానసిక రుగ్మతలకు యోగా పరిష్కారం చూపుతుందన్నారు. మన పూర్వీకులు యోగాను మనకు వారసత్వంగా ఇచ్చారని, దీన్ని మనం భావితరాలకు అందించటానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులు, యోగా సాధకులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.