ముస్లిం వర్గాలకు ఆలోచించే సీట్లిస్తాం

ప్రాధాన్యతనిచ్చిన అర్థం చేసుకోలే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి

Jun 5, 2024 - 17:14
 0
ముస్లిం వర్గాలకు ఆలోచించే సీట్లిస్తాం

లక్నో: రానున్న సమయంలో ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులకు ఆలోచించే సీట్లు ఇస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. వారు బీఎస్పీ పార్టీ మనోగతాన్ని కూడా అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల ఎన్నికల ఫలితాలలో 79 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేదు. బుధవారం పార్టీ పరంగా ప్రకటన విడుదల చేశారు. ముస్లిం సమాజానికి పార్టలో సరైన ప్రాతినిధ్యాన్ని ఇచ్చినా వారు తమ వారిని గెలిపించుకోలేకపోయారని అన్నారు. భవిష్యత్​ లో బీఎస్పీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్పీ (సమాజ్​ వాదీ పార్టీ), ఆర్​ ఎల్డీ పార్టీలతో పొత్తు కూడా తమకు కలిసి రాలేదని ఈ ఎన్నికల్లో నిరూపితం అయ్యిందన్నారు. 2019లో బీఎస్పీ యూపీ నుంచి పది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.