నేరాల నియంత్రణకు చర్యలు ఎస్పీ జానకీ షర్మిల

Measures to control crime SP Janaki Sharmila

Jun 5, 2024 - 17:18
Jun 5, 2024 - 17:19
 0
నేరాల నియంత్రణకు చర్యలు ఎస్పీ జానకీ షర్మిల

నా తెలంగాణ, నిర్మల్: నేరాలు చోటు చేసుకోకుండా  పోలీసులు సకాలంలో స్పందించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల పోలీసులకు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులతో బుధవారం ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు అక్రమంగా విక్రయించే ప్రమాదం పొంచి ఉందన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలో బక్రీద్ పండుగ పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణా కూడా జరిగే అవకాశం ఉందన్నారు.  అక్రమ రవాణా పై కూడా నిఘా పెట్టాలన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు తమదైన శైలిలో పనితీరును మెరుగుపరుచుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు.