ఏచూరి మృతి.. రాష్ట్రపతి సంతాపం
Yechury's death.. President's condolence
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. తొలుత విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో, పార్లమెంటేరియన్‌గా సీతారాం ఏచూరికి విశిష్టమైన, ప్రభావశీలమైన స్వరం ఉందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన సిద్ధాంతకర్త అయినప్పటికీ, ఏచూరి పార్టీలకతీతంగా ఉన్నత వ్యక్తిత్వంతో వ్యవహరించేవారని కొనియాడారు. ఏచూరి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.