ప్రతీ పని దేశం పేరుతో జరగాలి

దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ 

Dec 7, 2024 - 13:58
 0
ప్రతీ పని దేశం పేరుతో జరగాలి

లక్నో: ప్రతి పని దేశం పేరుతోనే జరగాలని, దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ యోగి అన్నారు. శనివారం వారణాసిలోని స్వరవేద్​ మహామందిర్​ ధామ్​ లో ఏర్పాటు చేసిన ‘విహాంగం యోగా సంత్​ సమాజ్​’ స్థాపన శతాబ్ధి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ప్రసంగిస్తూ దేశం సురక్షితంగా ఉంటే మన మతం కూడా సురక్షితంగా ఉంటుందన్నారు. మతం సురక్షితంగా ఉంటే మనం కూడా సురక్షితంగా ఉంటామన్నారు. ఈ దేశం అనేకయేళ్లు బానిస సంకెళ్లను తట్టుకొని నిలిచింన్నారు. సద్గురు సదాఫల్​ మహరాజ్​ తన ఆధ్యాత్మిక సాధనతో బానిస సంకెళ్ల నుంచి విముక్తి లభించిందని, ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నారు. మహారాజ్​ ఒంటరిగా కూర్చోవద్దని, ఒక పని పూర్తయ్యాకే మరో పనిచేపట్టాలని చెప్పారన్నారు. అంతేగాక ప్రతీ పని దేశం, సనాతన ధర్మం పేరుతోనే చేపట్టాలని అన్నారని గుర్తు చేశారు. ప్రయాగ్​ రాజ్​ లో నిర్వహించే మహాకుంభ్​ జనవరి 13 నుంచి ప్రారంభ కానుందన్నారు. ఈ మహాకుంబ్​ ఒక సాంస్కృతిక వారసత్వమన్నారు. 500యేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాక అయోధ్యలో శ్రీరాముడిని నెలకొల్పాలక జరిగే ప్రథమ మహాకుంభ్​ కు అత్యంత విశిష్టత ఉందని యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వారణాసి, కాశీ యూపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధికి మారుపేరుగా నిలవడంలో తమవంతు భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే ఉంటామని యోగి ఆదిత్యనాథ్​ అన్నారు.