చేకూరని భారీ విజయం ఫడ్నవీస్​ రాజీనామా ?

ఆలోచన మానుకోవాలన్న బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్​ కలిసికట్టుగా మళ్లీ ప్రయత్నిద్దామని హితవు

Jun 5, 2024 - 16:45
 0
చేకూరని భారీ విజయం ఫడ్నవీస్​ రాజీనామా ?

ముంబై: మహారాష్ర్టలో బీజేపీకి అత్యధిక సంఖ్​యలో ఎంపీ స్థానాలు దక్కకపోవడంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆయన రాజీనామా చేస్తానని బీజేపీ మహారాష్ర్ట అధ్యక్షుడు చంద్రశేఖర్​ బవాన్​ కులేకు తెలిపారు. అయితే చంద్రశేఖర్​ ఫడ్నవీస్​ ను వారించారు. గెలుపోటములు పార్టీల్లో సహజమన్నారు. తమ వంతు ప్రయత్నం చేసిన ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చేందుకు పార్టీ నేతృత్వంలో మరోమారు మనమందరం కలిసి కట్టుగా ప్రయత్నిద్దామని తెలిపారు. రాజీనామా ఆలోచనను మానుకోవాలని తెలిపారు. మహారాష్ర్టలో ఉన్న 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలం 9 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. శివసేన ఏక్​ నాథ్​ షిండే (ఎన్డీయే కూటమి) పలు స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఇక్కడి నుంచి ఎన్డీయేకి 17  స్థానాలు మాత్రమే దక్కాయి. మహారాష్ర్ట నుంచి 48 స్థానాల్లో 40 స్థానాలైనా కేంద్రానికి అందించాలని ఫడ్నవీస్​ టార్గెట్​ పెట్టుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో ఆయన మానసికంగా తన నిరాసక్తతను వ్యక్తం చేశారు.