భూభాగాలను ఇచ్చేస్తాం యుద్ధాన్ని ముగిస్తాం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో ఆధ్వర్యంలో శాంతి చర్చలు
కీవ్: ఓ వైపు ఇజ్రాయెల్ – లెబనాన్ ల మధ్య యుద్ధం సమసే దిశగా అడుగులు పడ్డాయి. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ న్స్కీ రష్యా స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న తమ దేశంలోని భూభాగాలను నాటో ఆధ్వర్యంలో విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో యూరోపియన్ దేశాల్లో ఇక మంటలు చల్లారనున్నాయి. శాంతిని పునరుద్ధరించేందుకు అంగీకరించారని అధ్యక్ష కార్యాలయ అధికార వర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం కీవ్ లోని రష్యా నియంత్రణలో ఉన్న భూభాగాన్ని కూడా దౌత్యపర చర్చల ద్వారా అందించనున్నారు. నాటోదేశాల శాంతి చర్చలు కొనసాగిస్తామన్నారు. రష్యా ఉక్రెయిన్ పై పెద్ద దాడికి సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి నుంచి ఈ ప్రకటన వెలువడడంతో ప్రపంచదేశాల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఇక ప్రపంచదేశాల్లో యుద్ధమేఘాలు తొలగి అభివృద్ధి దిశగా పయనించే అవకాశం ఉంది.