నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లభించే నిధులను వెంటనే విడుదల చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. న్యూ ఢిల్లీలోని పీఎం నివాసంలో శుక్రవారం ఉదయం స్టాలిన్ ప్రధానితో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.
సమగ్ర శిక్షా పథకం కింద 50 శాతం నిదులు, చెన్నై మెట్రో ఫేజ్–2కు నిధులకు ఆమోదం, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి, వారికి పడవలను అందజేయడం వంటి వాటిపై సీఎం, ప్రధాని మధ్య సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం స్టాలిన్ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
2021–22లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్–2 కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిధులను ప్రకటించారు. 2022లో ఆమోదం లభించింది. ఇప్పటివరకూ రూ. 18,564 కోట్లను కేటాయించారు. మరిన్ని నిధులు కావాలని సీఎం స్టాలిన్ అభ్యర్థించారు. తమిళ మత్స్యకారుల పరిష్కరించాలన్నారు. కేంద్ర మత్స్యకార మంత్రిత్వ శాఖ ద్వారా వారికి బోట్లను అందజేయాలని విజ్ఞప్తి చేశారు.