ఫంగల్​ తుపాను.. చెన్నైలో భారీ వర్షాలు

Fungal storm.. Heavy rains in Chennai

Nov 30, 2024 - 12:54
 0
ఫంగల్​ తుపాను.. చెన్నైలో భారీ వర్షాలు

పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు
చెన్నై విమానాశ్రయంలో రాకపోకలు నిలిపివేత
మత్స్యకారులు వేటకు వెళ్లద్దని ఐఎండీ హెచ్చరికలు
అధికారుల సెలవులు రద్దు
కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వం

చెన్నై: ఫంగల్​ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తిరువణ్ణామలై, పుదుచ్ఛేరి, కారైకల్​లోని అన్ని పాఠశాలలు, కార్యాలయాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. అధికారులు అత్యవసర విధుల్లో ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్​ పోర్ట్​ నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. రాత్రి 7 గంటల వరకు ప్రయాణాలు కొనసాగవని అధికారులు ప్రకటించారు. వాతావరణం సాధారణంగా మారితే విమానాల రాకపోకలు చేపట్టనున్నామన్నారు.  పలు సంస్థలకు చెందిన విమానాలన్నింటినీ నిలిపివేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్​ పట్టు జిల్లాలోని అన్ని పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. తుపాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం హై అలర్ట్​ ప్రకటించింది. ప్రత్యేక తరగతులు, పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, అధికారుల సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని రెస్క్యూ, ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలను సిద్ధంగా ఉంచింది. తుపాను తీవ్రతను బట్టి స్థానిక కలెక్టర్లే ఆయా పరిస్థితులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.