వైద్యురాలి హత్య.. కేంద్రానికే లేఖ రాయని సీఎం మమత

కేంద్రమంత్రి సుకాంత మజుందార్​

Aug 12, 2024 - 21:53
 0
వైద్యురాలి హత్య.. కేంద్రానికే లేఖ రాయని సీఎం మమత

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కోల్​ కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై సీఎం మమతా బెనర్జీ ఒక విధంగా మాట్లాడుతూ.. కనీసం సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ కూడా రాయలేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్​ సుకాంత మజుందార్​ విమర్శించారు. సోమవారం న్యూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైద్యురాలి హత్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

ఈ ఘటన నుంచి వైద్యులను తప్పుదోవ పట్టించాలనే దృక్కోణం ఆమెలో ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఘటన దురదృష్టకరమని, దేశాన్ని నివ్వేర పరిచే ఘటన అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు ఈ ఘటనపై తీవ్రంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తుంటే మమతా బెనర్జీకి మాత్రం చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా సీఎం మమతా బెనర్జీ నిష్పక్షపాత విచారణకు కేంద్రానికి లేఖ రాయాలని మజుందార్​ డిమాండ్​ చేశారు.