ఇస్కాన్ 17 అకౌంట్లు ఫ్రీజ్
ISKCON freezes 17 accounts
ఇస్కాన్ పై నిషేధం.. కోర్టు నిరాకరణ
కొత్త కుట్రలకు తెరతీసిన ప్రభుత్వం
లావాదేవీల వివరాలు అందించాలన్న బీఎఫ్ ఐయూ
ఢాకా: బంగ్లాదేశ్ లోని ఇస్కాన్ కు చెందిన 17మంది బ్యాంక్ అకౌంట్లను నెలరోజులపాటు బీఎఫ్ ఐయూ స్తంభింపచేసింది. చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ అనంతరం కోర్టులో జరిగిన వాద ప్రతివాదాల సందర్భంగా ఇస్కాన్ పై నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో బంగ్లా ప్రభుత్వం ఇస్కాన్ ను ఉగ్రసంస్థగా ప్రకటించి నిషేధం విధించాలన్న కుట్రలకు తెరతీసింది. అందులో భాగంగానే ఇస్కాన్ కు చెందిన 17 మంది అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. వీటిలో చిన్మోయ్ దాస్ అకౌంట్ కూడా ఉంది. బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (బీఎఫ్ఐయూ) అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఈ 17 మందికి చెందిన లావాదేవీల నిర్వహణ స్టేట్ మెంట్లను మూడు రోజుల్లోగా అందజేయాలని బీఎఫ్ ఐయూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశించింది. ఓ వైపు బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రపంచ దృష్టిని మరల్చేందుకే ఇస్కాన్ పై ఉగ్ర ముద్ర మేయాలని బంగ్లా దేశ్ ప్రభుత్వం తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది. చిన్నతప్పిదాన్ని కూడా అద్దంలో చూపి ఇస్కాన్ ను నిషేధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వ్యతిరేక చర్యలకు దిగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను పలు ప్రపంచదేశాలు ఇప్పటికే ఖండించాయి. వెంటనే మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ ను కోరింది.