మారిషస్​ కు చాగోస్​ ఇచ్చేస్తాం

బ్రిటన్​ ప్రకటన అర్థశతాబ్దం వివాదం సమసినట్లే

Oct 3, 2024 - 16:49
 0
మారిషస్​ కు చాగోస్​ ఇచ్చేస్తాం
లండన్​: మారిషస్​ కు హిందూ మహాసముద్రంలోని ‘చాగోస్​’ ద్వీపాన్ని తిరిగి ఇచ్చేయనున్నట్లు గురువారం బ్రిటన్​ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ప్రకటించారు. దీంతో ఇరుదేశాల మధ్య అర్థశతాబ్దంగా ఉన్న ఈ వివాదం కాస్త ముగిసినట్లయ్యింది. ఈ వివాదంపై ఇరుదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం చాగోస్​ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్​ కు అప్పగిస్తామని బ్రిటన్​ స్పష్టం చేసింది. ద్వీపంలో ఉన్న బ్రిటన్​ ప్రజలు స్వదేశానికి రాదలుచుకుంటే రావచ్చని పేర్కొంది. అదే సమయంలో అక్కడ ఉన్న సైనిక స్థావరాన్ని మాత్రం కొనసాగిస్తామని పేర్కొంది. హిందూ మహాసముద్రంలో యూకె, యూఎస్​ లు నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సైనిక స్థావరం ఇది. ఈ స్థావరం అప్పగింతపై గతంలో భారత్​ తన పూర్తిమద్దతును మారిషస్​ కు ప్రకటించింది. 
 
చాగోస్ ద్వీపసమూహం మధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న సుమారు 58 చిన్న దీవుల సమూహం. చారిత్రాత్మకంగా, ఈ ద్వీపసమూహం మారిషస్‌పై ఆధారపడే ప్రాంతం. 1814లో పారిస్ ఒప్పందం ప్రకారం యూకెకి ఈ ద్వీపం లభించింది. 1968లో మారిషస్​ కు స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుంచి ఈ దీవుల అప్పగింత వివాదం కొనసాగుతోంది.