ఉచ్చులో ఇరుక్కున్నారు! టర్కీకిపై ఇరాన్​ అసంతృప్తి

సిరియా అంతర్యుద్ధం చెరోవైపు బలం చాటుకునే పోరాటం

Dec 4, 2024 - 17:45
 0
ఉచ్చులో ఇరుక్కున్నారు! టర్కీకిపై ఇరాన్​ అసంతృప్తి

టెహ్రాన్​: అమెరికా, ఇజ్రాయెల్​ పన్నిన ఉచ్చులో టర్కీ చిక్కుకుందని ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ సలహాదారు అలీ వెలయతి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిరియా అంతర్యుద్ధం సందర్భంగా ఇరాన్​ టర్కీని లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ ప్రకటన వెలువడినట్లు టర్కీ భావిస్తోంది. టర్కీ తన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. చరిత్రలో ఇస్లాం పట్ల తమ వైఖరి స్థిరంగా ఉండాలన్నారు. టర్కీ ఇలాంటి చర్యలు తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. అలెప్పోపై దాడి నేపథ్యంలో టర్కీ అమెరికా, ఇజ్రాయెల్​ లకు సహకరిస్తూ సిరియాకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటుంది. సిరియాకు అనుకూలంగా ఇరాన్​ సహాయం చేస్తుంది. దీంతో ఇరాన్​ సలహాదారు ఈ ప్రకటన విడుదల చేశారు. సిరియా ప్రజాస్వామ్య తిరుగుబాటులో రష్యా, అమెరికాలు పెత్తనం చాటి చెప్పేందుకు రంగంలోకి దిగడంలో వీరికి మద్ధతుగా ఇటు సిరియాకు రష్యా, ఇరాన్​ మద్ధతుగా నిలుస్తుండగా, మరోవైపు తిరుగుబాటు దారులకు అమెరికా, ఇజ్రాయెల్​, టర్కీ మద్ధతుగా నిలుస్తున్నాయి. దీన్నే ఇరాన్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.