పార్లమెంట్​ ఎంపీలపై దాడి సిట్​ బృందం విచారణ

SIT team investigates attack on Parliament MPs

Dec 21, 2024 - 14:29
Dec 21, 2024 - 14:29
 0
పార్లమెంట్​ ఎంపీలపై దాడి సిట్​ బృందం విచారణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలపై దాడి ఘటనపై ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఇద్దరు వైసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఈ బృందం శనివారం నుంచి తమ దర్యాప్తును కొనసాగిస్తుంది. దర్యాప్తు నివేదికను డీసీపీకి అందజేస్తుంది. రాజకీయంగా కీలకమైన కేసు కావడంతో అత్యంత జాగ్రత్తగా కేసును డీల్ చేస్తున్నారు. ఈ బృందం పార్లమెంట్ బయట సీసీ టీవీ ఫుటేజ్ కోసం అడ్మినిస్టేషన్‌కు లేఖ రాసింది. ఫుటేజ్ అందాక పరిశీలించి అనేక ఎంపీల అభిప్రాయాలను కూడా తీసుకోనుంది. అదే సమయంలో రాహుల్ గాంధీని విచారణకు కూడా పిలవనున్నారు. తోపులాటలో రాహుల్ గాంధీ ఎ–1గా ఎఫ్ ఐఆర్ నమోదైంది. తోపులాటపై రు పార్టీల ఎంపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ఉండగా సిట్ దర్యాప్తు నివేదిక కీలకంగా మారనుంది. పార్లమెంట్ స్ర్టీట్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై ఆరు సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదైంది. అక్కడి నుంచి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు.