అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ కాంగ్రెస్, కూటమి

తమిళనాడు ఎన్నికల సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Apr 7, 2024 - 17:04
 0
అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ కాంగ్రెస్, కూటమి

తిరువనంతపురం: కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు అవినీతి, అక్రమాలకు కేరాఫ్​పార్టీలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపి.నడ్డా పునరుద్ఘాటించారు. ఆదివారం తమిళనాడులోని అరియలూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమిళనాడు గ్రామీణాభివృద్ధికి రూ. 10,436 కోట్లు కేటాయించారని తెలిపారు. తమిళనాడులో స్టాలిన్​ అవినీతి పాలనలో అభివృద్ధి నిలిచిపోతోందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్​ సాధించడం ఖాయమన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ రూపొందుతుందని పేర్కొన్నారు. 2014 కంటే ముందు పాలనను ప్రజలు ఓ సారి బేరీజు వేసుకోవాలని నడ్డా తెలిపారు. ఎంతలా మార్పు వచ్చిందో మీకే తెలుస్తుందన్నారు. ప్రధాని మేడ్​ ఇన్​ ఇండియా నినాదంతో దేశ పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగిందన్నారు. దిగుమతులను తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని సాధిస్తూ ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దీంతో 97 శాతం మొబైల్​ ఫోన్లు భారత్​లోనే తయారవుతున్నాయని నడ్డా స్పష్టం చేశారు. మరోవైపు తిరుచిరాపల్లిలో రోడ్‌షో నిర్వహించేందుకు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసు కమిషనర్‌ను కలిసి అనుమతి కోరనున్నట్టు నడ్డా తెలిపారు. 

దొరికిన కారు!

కాగా జేపీ నడ్డా కారు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ కారును పోలీసులు వారణాసిలో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశారు. గోవింద్​పురిలోని ఓ సర్వీస్​ సెంటర్​లో కారు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మార్చి 19న దుండగులు కారును చోరీ చేశారు.