పులుల అక్రమ రవాణాపై సీబీ‘ఐ’

ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం

Oct 3, 2024 - 16:29
 0
పులుల అక్రమ రవాణాపై సీబీ‘ఐ’

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పులుల అక్రమ రవాణాను పూర్తిగా కట్టడి చేసేందుకు భారత్​ నడుం బిగించింది. సీబీఐ, కేంద్ర వన్యప్రాణుల రక్షణ విభాగం గురువారం న్యూ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించాయి. అంతర్జాతీయ నేరస్థుల పోలీస్​ ఆర్గనైజేషన్​ సహకారంతో సీబీఐ ఈ సమావేశాన్ని నిర్వహించింది. భారత్​ నుంచి నేపాల్​ అక్కడి నుంచి చైనాకు పులులు, చిరుతపులులు, అటవీ జంతువుల అక్రమ రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గతంలో గుర్తించింది. దీన్ని నిరోధించేందుకు, జీవ వైవిధ్య పరిరక్షణకు ఉన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. క్రిమినల్​ నెట్​ వర్క్​ లపై దృష్టి సారించాలని నిర్ణయించారు. అదే సమయంలో నేపాల్​ చట్టాల ప్రకారం సరిహద్దులో అటవీ జంతువుల సంరక్షణకు చర్యలు చేపట్టడంలో సహకారాన్ని తీసుకోవాలని, బలోపేతం చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఇంటలిజెన్స్​ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. భారత్​ లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలతో పులులు, చిరుతపులుల సంఖ్యలో క్రమంగా వేగం పెరుగుతోంది. ఇదే జంతుస్మగ్లర్లకు అవకాశంగా మారుతోంది. భారత్​ లో పెరుగుతున్న పులుల సంఖ్యపై భారత్​, నేపాల్​, చైనా స్మగ్లర్ల దృష్టి ఉన్నట్లు వన్యప్రాణి విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో వాటి రక్షణ కోసం పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.