నా తెలంగాణ, మెదక్: మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరిట జరుగుతున్న విధ్వంసంతో నిరుపేదల ఇల్లు కూలగొట్టడం బాధాకరమన్నారు. మెదక్ లో అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని అన్నారు. రుణమాఫీని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మైనంపల్లి హోదా కాంగ్రెస్ లో ఏంటని? ప్రశ్నించారు. వీరి ఆధ్వర్యంలోనే మెదక్ అభివృద్ధి 20యేళ్లు వెనక్కు వెళ్లిందన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, ఆర్ కె.శ్రీనివాస్, హవేలి ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ప్రభు రెడ్డి, సాయిలు, రాజు, మోహన్ రాథోడ్, కిరణ్, భువన్, చందు పాషా తదితరులు పాల్గొన్నారు.