నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో అత్యధిక ఇథనాల్ ఉత్పత్తిని సాధించామని ఆహార, ప్రజాపంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీలో నిర్వహించనున్న రెండు రోజుల ఇండియా షుగర్ అండ్ బయో ఎనర్జీ సదస్సును ప్రారంభించారు. 2030కి ప్రభుత్వం ఐదు శాతం బయోడిజీల్ లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి 20 శాతం ఇథనాల్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత్ లో 250 ఇథనాల్ డిస్టిలరీల నుంచి 1,633 కోట్ల లీటర్లకు చేరుకుందన్నారు. ఇది అత్యధికమన్నారు.
దేశంలో చెరకు ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, దిగుబడి 19 శాతం పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 55 మిలియన్ల రైతులకు ఈ రంగం ఆర్థికంగా దోహదపడుతుందన్నారు. అదే సమయంలో ధరల తగ్గుదలకు కూడా కారణమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కనీస మద్ధతు ధర వల్ల రైతులు ఉత్పత్తిని పెంచారన్నారు. దీంతో డిమాండ్ తగ్గి ధరల తగ్గుదల, పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవడంతో రైతులకు లాభం చేకూరుతోందన్నారు.
అదే సమయంలో ఈ రంగం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వినియోగం, ఎగుమతి కోసం భారత్ ను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందన్నారు. గతేడాది రూ. 19,744 కోట్లతో ఈ మిషన్ ను ప్రారంభించామని మంత్రి జోషి తెలిపారు.