కేజ్రీవాల్ కు మూడురోజుల సీబీఐ రిమాండ్
CBI remand Kejriwal for three days
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ కేసు సీఎం కేజ్రీవాల్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. బుధవారం ఈ కేసులో సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పై ఇచ్చిన స్టేను సుప్రీంలో సవాల్ చేద్దామనుకున్న సమయంలో కేజ్రీవాల్ కు మళ్లీ చుక్కెదురయ్యింది. రౌస్ అవెన్యూ కోర్టుకు సీబీఐ అరెస్టుకు కావాల్సిన పత్రాలను సమర్పించింది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసింది. సీబీఐ ఆయన్ను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. రాత్రి ఏడు గంటలకు మూడు రోజుల సీబీఐ కస్టడీ విధించింది.
సునీతా కేజ్రీవాల్..
కాగా సీబీఐ అరెస్టు.. రిమాండ్ పై సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను బయటకు రాకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే బెయిల్ వచ్చిన సమయంలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు.