ఘనంగా చాకలి ఐలమ్మ 120వ జయంతి

120th birth anniversary of Chakali Ailamma

Sep 26, 2024 - 20:47
 0
ఘనంగా చాకలి ఐలమ్మ 120వ జయంతి

నా తెలంగాణ, ఆదిలాబాద్: చాకలి ఐలమ్మ 129 వ  జయంతిని పురస్కరించుకొని స్థానిక రిమ్స్ ఆసుపత్రి ముందు గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి  మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వీర నారీ చాకలి ఐలమ్మ జయంతి ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.