భారత్​–చైనా విమానాల పునరుద్ధరణ

మంత్రి జై శంకర్​ కు చైనా మంత్రి వాంగ్​ యి విజ్ఞప్తి

Nov 19, 2024 - 15:33
 0
భారత్​–చైనా విమానాల పునరుద్ధరణ

రియో డిజెనిరో: భారత్​–చైనా విమాన సేవలను తిరిగి ప్రారంభించాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్​ యి విజ్ఞప్తి చేశారు. బ్రెజిల్​ రియో డిజెనిరోలో నిర్వహిస్తున్న జీ–20 సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ తో వాంగ్​ యి కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇరుదేశాల్లోని లడఖ్​ ప్రతిష్ఠంభన ముగియడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత్​–చైనా బంధాల బలోపేతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జై శంకర్​ మాట్లాడుతూ.. భారత్​ – చైనా బంధాల పటిష్ఠం, ద్వైపాక్షిక అంశాలలో పురోగతిని సాధిస్తామన్నారు. ప్రపంచ పరిస్థితులపై కూడా అభిప్రాయాలను పంచుకున్నామన్నారు. ఇరుదేశాల్లోని ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి నమ్మకం, విశ్వాసం బలమైన పునాది అన్నారు. జర్నలిస్టుల మార్పిడి, వీసాలను సులభతరం చేయడం, సహకారాన్ని వేగవంతంగా అందించుకోవడం వంటి విషయాలపై దృష్టి సారించామన్నారు. రష్యా కజాన్​ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ, చైనా జిన్​ పింగ్​ తో భేటీ అయ్యారు. ఆ తరువాత లడఖ్​ వివాదాం కొలిక్కి వచ్చింది.