హౌరా నుంచే పోటీ బాబూన్ సంబంధాలు లేవన్న సీఎం బెనర్జీ
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆమె సోదరుడు బాబూన్ఝలక్ ఇచ్చాడు. హౌరా స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిపై పోటీకి దిగనున్నట్లు బుధవారం ప్రకటించాడు.
కోల్కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆమె సోదరుడు బాబూన్ఝలక్ ఇచ్చాడు. హౌరా స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిపై పోటీకి దిగనున్నట్లు బుధవారం ప్రకటించాడు. ఆ స్థానంలో పోటీపై బాబూన్ ఆశలు పెట్టుకున్నాడు. హౌరా నుంచి టీఎంసీ అభ్యర్థిగా ప్రసూన్ బెనర్జీ పేరును ప్రకటించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాబూన్ మమత నిర్ణయంపై మండిపడ్డారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని విస్మరించారని ఆరోపించారు. కాగా సోదరుడి నిర్ణయంపై మమత మాట్లాడుతూ.. చాలా రోజులుగా తనకు తన సోదరుడు బాబూన్ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించడం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థిగా బూబన్ హౌరా నుంచి పోటీలో ఉండనున్నట్లు స్పష్టం చేశాడు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో కూటమికి ఝలక్ ఇచ్చి అన్ని స్థానాల్లో పోటీకి దిగుతున్న టీఎంసీ మేఘాలయలోనూ కూటమిని కాదని తమ అభ్యర్థులను రంగంలోకి దింపడం విశేషం. దీంతో మమతా బెనర్జీ నిర్ణయాలు కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్కు మింగుడుపడడం లేదు.