వక్ఫ్ బోర్డు సమావేశం.. విపక్ష ఎంపీల వాకౌట్
Waqf Board meeting.. Walkout of opposition MPs
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సంయుక్త పార్లమెంటరీ కమిటీ మంగళవారం నిర్వహించిన సమావేశాన్ని పలువురు ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. బీజేపీ నాయకులు కించపరిచే వ్యాఖ్యలు చేశారని, అవమానించారని ఆరోపించారు. నిబంధనల మేరకు కమిటీ పనిచేయడం లేదని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లు – 2024పై ఏర్పాటైన కమిటీ దేశవ్యాప్తంగా పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా పలువురిని సమావేశానికి ఆహ్వానించింది. కళ్యాణ్ బెనర్జీ, గౌరవ్ గొగోయ్, ఎ. రాజా, మహ్మద్ అబ్దుల్లా, అరవింద్ సావంత్ లు గంటపాటు సమావేశం నుంచి బయటికి వెళ్లారు. అనంతరం హాజరయ్యారు. ఈ అంశాన్ని బీజేపీ సభ్యులు తీవ్రంగా కండించారు. కమిటీ చైర్ పర్సన్ జగదాంబిక పాల్ పై విపక్ష సభ్యులు అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టామని దీంతో విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారని బీజేపీ ఆరోపించింది.