90 అయినా పరుగు ఆపను
శరద్ పవార్ మహా ఎన్నికలపై సీట్ల ఖరారు ఇంకా ప్రకటించని స్థానాలు
ముంబాయి: 84యేళ్లు అయినా, 90 యేళ్లు అయినా తన రాజకీయ పరుగు ఆగబోదని ఎన్సీపీఎస్పీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. మంగళవారం ముంబాయిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శరద్ పవార్ వృద్ధుడైనా విశ్రమించబోడన్నారు. ప్రజా సంక్షేమమే న ముఖ్యోద్దేశమన్నారు.
మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలపై మహాఅఘాడీ పార్టీలు సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో పలు సీట్లను ప్రకటించగా ఇంకా కొన్ని సీట్లలో వివాదాలు ఉన్నాయి. మహావికాస్ అఘాడీ – శివసేన (యూబిటి), కాంగ్రెస్, ఎన్ సీపీసీపీ, సమాజ్ వాదీ పార్టీల ప్రముఖ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 222 స్థానాలలో ఆయా పార్టీలు పోటీలో అభ్యర్థులను నిలపనున్నాయి. మిగతా స్థానాలపై వివాదం నెలకొంది. అయితే ఈ స్థానాలపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయా పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏయే పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందనేది ఇంకా స్పష్టంగా ప్రకటించకపోవడం గమనార్హం.