2025 ఉద్యోగుల జీతాల్లో 9.5 శాతం వృద్ధి

డబ్లూటీడబ్ల్యూ నివేదిక వెల్లడి

Oct 15, 2024 - 15:07
 0
2025 ఉద్యోగుల జీతాల్లో 9.5 శాతం వృద్ధి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​ లో 2025లో ఉద్యోగుల జీతాల్లో 9.5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూటీడబ్ల్యూ (వర్క్​ టు గెదర్​ విత్​) ఇండియా కన్సల్టింగ్​ అధికారి రాజుల్​ మాథుర్​ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఈ సంస్థ అందించిన నివేదికను వెల్లడించారు. కరోనా అనంతరం ఉద్యోగులు స్థిరత్వాన్ని కోరుకుంటుండడంతో సంస్థల లావాదేవీల్లో లాభాలు నమోదవుతున్నాయి. దీనివల్ల ఆయా సంస్థలు ఉద్యోగుల పనితీరు పట్ల సంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2025లో  ఫార్మాస్యూటికల్స్ (10 శాతం), తయారీ (9.9 శాతం), బీమా (9.7 శాతం), క్యాప్టివ్, ఎస్​ఎస్​వో రంగాలు (9.7 శాతం), రిటైల్ (9.6 శాతం) వేతన వృద్ధి ఉండే అవకాశం ఉందన్నారు.  సాధారణ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, వ్యాపార సేవల రంగంలో 9 శాతం వరకు జీతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని వివరించారు. 

భారత్​ లోనే గాక వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్​, చైనా, థాయ్​ లాండ్​, హాంగ్​ కాంగ్​, ఆస్ర్టేలియా, మలేషియా, జపాన్​ లలోనూ పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల్లో కూడా వృద్ధి నమోదవుతుందన్నారు. కాకపోతే భారత్​ లోనే అత్యధిక శాతం వేతనం పెరుగుతుందన్నారు. మిగతా దేశాల్లో పెరుగుదల శాతం తగ్గుతుందని నివేదికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఈ సర్వే కోసం 162 దేశాల్లో 32వేల మంది యాజమాన్యాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ నివేదికను రూపొందించారు.