బాపూజీ బాటలో నడవాలి

ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి

Oct 2, 2024 - 17:49
Oct 2, 2024 - 17:50
 0
బాపూజీ బాటలో నడవాలి
నా తెలంగాణ, మెదక్​: మహాత్మా గాంధీ బాటలో యువతరం నడవాలని, అహింసా మార్గాన్ని వీడి శాంతియుతమైన మార్గాన్ని ఎంచుకోవాలని  మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాని పురస్కరించుకోని మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధ్యమంలో గాంధీ పాత్ర మరువరానిదని ఆయన గుర్తుచేశారు. 
 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, దాయర లింగం, ప్రవీణ్ గౌడ్, బొద్దుల రుక్మిణి క్రిష్ణ, రాగి అశోక్, ఆవారి శేఖర్, గోదల సాయిరాంలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, మహేశ్ గౌడ్, గాడి రమేశ్, మంగ రమేశ్ గౌడ్, పేరూర్ శంకర్, శ్రీనివాస్ చౌదరి, మొండి పద్మారావు, గూడూరి క్రిష్ణ, గూడూరి అరవింద్, లక్కరు శ్రీనివాస్, శివ రామక్రిష్ణ, పి. నాగరాజు, పోచందర్, హపీజ్ మోల్సాబ్, దాయర రవి, పసల్వాడి సిద్దిరాములు, సామ్సన్ బాని, బాల్ రాజ్, వెంకటనారాయణ, భరత్ గౌడ్, కొండ శ్రీను, రమణ, దేవుల  రమేశ్, నాగిరెడ్డి, ప్రభాకర్, బెస్త పవన్, జిలకరి రాజలింగం, మైసన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు. 
 
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి నివాళి..

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులతో కలిసి  జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మ గాంధీ  చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా, అహింస మార్గంలో పోరాడి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకొచ్చారని తెలిపారు. విద్య, ఆర్థిక, కుల సమానత్వంతోనే గ్రామస్వరాజ్యం సాధ్యమని పద్మా దేవేందర్​ రెడ్డి అన్నారు.
 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పట్టణ పార్టీ కార్యదర్శి కృష్ణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు  కృష్ణారెడ్డి, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, నాయకులు లింగ రెడ్డి, శంకర్, మోహన్ రాథోడ్, ఇస్మాయిల్, కిరణ్, రంజిత్ నాయక్, లడ్డు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి దేవేందర్​ రెడ్డి పరామర్శ..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించి సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మక్తా భూపతి పూర్ గ్రామానికి చెందిన కర్రోళ మల్లేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మల్లేశం కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ మండల అధ్యక్షుడు అంజా గౌడ్, మాజీ సర్పంచ్ సుంకరి నర్సిములు, గ్రామాధ్యక్షుడు  సత్యనారాయణ గౌడ్, నాయకులు ఇక్బాల్, ముష్టి గంగయ్య, బండమీది దుర్గయ్య, బాలరాజ్, సోషల్ మీడియా ఇంచార్జి పోకల మహేష్, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.