ఇద్దరు నక్సల్స్​ లొంగుబాటు

Two naxals surrender

Dec 21, 2024 - 14:06
 0
ఇద్దరు నక్సల్స్​ లొంగుబాటు

ముంబాయి: మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు భద్రతా దళాల ముందు లొంగిపోయారని పోలీసులు శనివారం మీడియాకు సమాచారం అందించారు. వీరిపై ప్రభుత్వం రూ. 10 లక్షల రివార్డును ప్రకటించిందన్నారు. లొంగిపోయిన గడ్చిరోలి వాసి రామసు పోయం (55), నారాయణ్​ పూర్​ కు చెందిన రమేష్​ కుంజమ్​ (25)లపై హత్యా, దోపిడీ, కిడ్నాప్​ వంటి కేసులున్నాయని తెలిపారు. వీరిద్దరిపై ఐదు హత్యలు, ఒక దోపిడీ నేరం సహా 12 కేసులున్నాయని తెలిపారు. 1992లో టిపాగఢ్​ ఎల్​ ఓఎస్​ లో సభ్యుడిగా పోయం చేరాడన్నారు. ఏరియా కమిటీ మెంబర్​ గా ఎదిగాడని తెలిపారు. 2019లో రమేష్​ నక్సల్స్​ లో చేరాడన్నారు. 2021లో ఎల్​ ఓఎస్​ సభ్యుడయ్యాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై రూ. 2 లక్షల రివార్డు ఉందన్నారు. కాగా వీరిపై ఉన్న రివార్డుతోపాటు ప్రభుత్వ పరంగా కూడా ఆర్థిక సహాయం అందజేతపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.