ఉత్తమ బోధనపై కలెక్టర్​ హర్షం

The collector is happy about the best teaching

Sep 18, 2024 - 18:28
 0
ఉత్తమ బోధనపై కలెక్టర్​ హర్షం

నా తెలంగాణ, మెదక్​: నాణ్యమైన పోషకాహారం, క్రమశిక్షణ ఉత్తమ విద్యా బోధనకు మెదక్ జిల్లా అంగన్​ వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా  కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అంగన్​ వాడీ సెంటర్ పిల్లలు చెప్పిన పద్యాలను విని కలెక్టర్​ హర్షం వ్యక్తం చేశారు. అంగన్​ వాడీ టీచర్ ను సన్మానించారు. క్షేత్రస్థాయిలో పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామంలో పాఠశాల, అంగన్​ వాడీ సెంటర్  ను బుధవారం కలెక్టర్​ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన పోషకాహారం, ఉత్తమ విద్యా  బోధన, క్రమశిక్షణకు ప్రతిరూపాలన్నారు.  మెదక్ జిల్లా  అంగన్​ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్​ రాజ్​ అన్నారు. గ్రామంలో పర్యటిస్తూ స్వచ్ఛతలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యతన్నారు. స్వచ్ఛతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.