సమూల మార్పునకే జేఎస్పీ

బిహారీల స్వరాన్ని ఢిల్లీకి వినిపిస్తాం బాపూజీ జయంతిన పార్టీని ప్రకటించిన ప్రశాంత్​ కిషోర్​ 243 స్థానాల్లో పోటీ ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడంలో అన్ని పార్టీలూ విఫలం

Oct 2, 2024 - 17:33
 0
సమూల మార్పునకే జేఎస్పీ

పాట్నా: బిహార్​ లో సమూల మార్పునకే తాను పార్టీ పెట్టానని ప్రశాంత్​ కిషోర్​ స్పష్టం చేశారు. తన పార్టీ నేతృత్వంలో బిహారీల స్వరం ఢిల్లీకి వినిపించేలా చేస్తానని అన్నారు. బుధవారం గాంధీ జయంతి రోజున మహాత్మునికి నివాళులర్పించిన జేఎస్​ పీ అధినేత, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్​ కిషోర్​ రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీకి సంబంధించి ప్రజాభిప్రాయం, ప్రజలకు మేలు చేసే అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రతీ పెద్ద నిర్ణయం వెనుక ముందుగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. రాజకీయాల్లో నూతన శకాన్ని ఆరంభిస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు? వ్యూహం, పదవీ కాలం, విధి విధానాలు వంటి అనేక కీలక నిర్ణయాలు ఇంకా తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే ఏడాది బిహార్​ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేఎస్పీ 243 స్థానాల్లో పోటీ చేయనుందని స్పష్టం చేశారు. బిహార్​ లో 30–35 ఏళ్లుగా పాలిస్తున్న రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని అందుకోవడంలో పూర్తిగా విఫలం చెందాయని తెలిపారు. బిహార్​ వాసులను ఇతర రాష్ర్టాల్లో తీవ్రంగా హింసించడాన్ని ఆయన తప్పుబట్టారు. బిహార్​ విద్య, వైద్యం, నిరుద్యోగం, వెనుకబాటు తనం, మౌలిక సదుపాయాల కల్పనలే తమ ప్రధాన ఏజెండా అని ప్రశాంత్​ కిషోర్​ స్పష్టం చేశారు.
.............