మహాత్ముడికి ఆశయ సాధనకు కృషి

నివాళులర్పించిన మెదక్​ బీజేపీ శ్రేణులు

Oct 2, 2024 - 18:13
Oct 2, 2024 - 21:02
 0
మహాత్ముడికి ఆశయ సాధనకు కృషి
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: మహాత్ముడి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ గంజి మైదానంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ రఘునందన్‌రావు వెంట నివాళులర్పించిన వారిలో జహీరాబాద్‌ బీబీ పాటిల్‌, ఎంపీపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని వక్తలు మాట్లాడుతూ.. స్వచ్ఛతకు ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలన్నారు. స్వచ్ఛభారత్ కు ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉంటేనే లక్ష్యం నెరవేరుతుంది. 
 
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హైడ్రా పేరుతో నిరుపేదలు కూల్చడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంపై బీజేపీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎంను డిమాండ్ చేస్తూ లేఖను కూడా పంపామని తెలిపారు. ఆడబిడ్డపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని వదిలిపెట్టబోమని. 
 
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, డాక్టర్ రాజు గౌడ్, కౌన్సిలర్లు మందులు నాగరాజ్, కసిని వాసు, రమేష్ మాణిక్ రావు, రాజేశ్వరరావు పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, ద్వారకా రవి, కోవూరు సంగమేశ్వర్ జగన్, వేణుమాధవ్ , తులసి రెడ్డి, నరేన్ పాండే, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లేశం మురళీధర్ రెడ్డి, బసవరాజ్ పటేల్, బుర్ర ప్రవీణ్ యాదవ్, సాయి రెడ్డి, రాము, రవిశంకర్, పవన్ ఉన్నారు.
ప్రపంచానికి మార్గదర్శనం మహాత్ముడి శాంతి సూత్రాలు: కలెక్టర్​..

దేశానికి శాంతి, అహింస, సత్యం వంటి సూత్రాల ద్వారా మార్గదర్శనం చేసిన గొప్ప మహానీయులు మహాత్మాగాంధీ అని ఆయన తెలిపిన శాంతి సూత్రాలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్​ క్రాంతి వల్లూరు తెలిపారు. బుధవారం మహాత్మాగాంధీకి కలెక్టర్​ క్రాంతి, జడ్పీసీఈవో జానికిరెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. మహాత్ముడి ఆశయ సాధనకు ఆయన నిర్దేశించిన మార్గంలో పయనించాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రలో ఎన్నటికీ ఆయన చెప్పిన సూత్రాలు ఆచరణీయమన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు  పాల్గొన్నారు.
టేక్మాల్‌లో తహశీల్దార్‌ మహాత్మునికి నివాళులు..

టేక్మాల్ మండల కేంద్ర తహశీల్దార్ ఎమ్మార్వో తులసి రామ్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం మహాత్మా గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సాయి శ్రీకాంత్, సాయిలు మహేష్ శేఖర్ నిర్వహించారు.
 
బాపూజీకి అదనపు ఎస్పీ నివాసులు..

అహింసా మార్గంలో తెల్లదొరలను మహాత్మా గాంధీ తరిమి కొట్టారని జిల్లా అదనపు ఎస్పీ సంజీవ్ రావు అన్నారు. గాంధీ జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్. మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. శాంతి, అహింసలతో ఆయుధాలను సైతం ఎదుర్కొని పోరాడి ఒడ్డి నిలిచి స్వాతంత్ర్యాన్ని సాధించారని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ సుమన్, సిబ్బంది నియమించబడ్డారు.
 
బాపూజీకి వాసవి క్లబ్ నివాళులు..
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి క్లబ్స్ సంగారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధికారులు వి ఎన్. చంద శ్రీధర్, వి ఎన్. పుల్లూరు ప్రకాష్, జిల్లా వైస్ గవర్నర్ ఇరుకుళ్ల ప్రదీప్ కుమార్, జిల్లా ఇన్ చార్జ్ కొంపల్లి విద్యాసాగర్, రీజియన్ చైర్మన్ నామ భాస్కర్, క్లబ్ అధ్యక్షులు బిపేట వెంకటేశం, కార్యదర్శి గుండా శివశంకర్, చంద్రశేఖర్, రాచర్ల ప్రసాద్ ఉన్నారు. 
.................