రియల్​ మోసాలపై కఠిన చర్యలు

కొనుగోలుదారులు జాగ్రత్త వహించాలి జిల్లా ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి

Sep 15, 2024 - 17:05
 0
రియల్​ మోసాలపై కఠిన చర్యలు

నా తెలంగాణ, మెదక్​:  ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్​ ఉమార్​ రెడ్డి (ఐపీఎస్​) అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్​ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్​ చుట్టుపక్కల ఉన్న భూములకు భారీ డిమాండ్​ ఉందన్నారు. చాలామంది ఇంటిస్థలం కొనుగోలు ఆసక్తి చూపిస్తుండడంతో సామాన్యుల అమాయకత్వమే వ్యాపారస్తుల ఆదాయవనరుగా మారుతోందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఒకటికి రెండుసార్లు ధృవపత్రాలు సరైనవో కాదో? విచారించి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. పలువురు రియల్​ మోసాలపై తమకు ఫిర్యాదులు అందాయన్నారు. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శంకరంపేటలో రియల్​ ఎస్టేట్​ పేరిట మోసాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కూకట్​పల్లికి చెందిన బాధితురాలు ఇలాగే మోసపోయిందన్నారు. మోసంచేసిన ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించామన్నారు.