పదేళ్లుగా కొబ్బరికాయలు కొట్టేందుకే బీఆర్‌ఎస్ పరిమితం
చేతల్లో చేసి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం
2024–25 తరగతులు ప్రారంభించేలా చర్యలు
ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
నా తెలంగాణ, మెదక్: మెదక్ నియోజక వర్గానికి మంజూరైన మెడికల్ కళాశాల అనుమతిపై పలు పార్టీల నాయకులు ఆరోపణలు బెడిస్తే కొట్టేలా కళాశాలకు అనుమతి లభించిందని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. మంగళవారం అనుమతి లభించిన సూచన మైనంపల్లి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్‌కు ఇచ్చిన మెడికల్ కాలేజీకి ప్రత్యేకంగా చొరవ చూపడమే కాకుండా ఢిల్లీలోని కేంద్ర మెడికల్ బోర్డుతో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేశామని చెప్పారు. 2024-2025 విద్యా సంవత్సరానికి చేప పిల్లల ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ మెదక్ ను దగా చేసిందే తప్ప ఒరగబెట్టిదేమీ లేదు. మెడికల్ కాలేజీ విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టడం తప్ప చేసిందేమీ అందించండి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే కళాశాల అనుమతులు సాధించి చేతల్లో చూపించారు. జిల్లాకు ఈ పరిణామం శుభప్రదమన్నారు. మెడికల్ కళాశాల వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని ఆయన తెలిపా
రు.