దేశ సంక్షేమం కోసం ఓటు కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి జి. కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బర్కత్ పురాలో కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నా తెలంగాణ, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బర్కత్ పురాలో కేంద్ర మంత్రి, బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశాను. ఓటు ప్రాథమిక హక్కు. ఓటు వేసేందుకే ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజు సెలవు ఇచ్చింది. ప్రజలు దీన్ని సాధారణ సెలవుదినంగా పరిగణించవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండుగ. దేశ అభివృద్ధి, దేశ భద్రత, సంక్షేమం కోసం ఓటు వేయండి. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగ అని చెప్తుంటారు. కాబట్టి ప్రజలందరూ ప్రజస్వామ్య పండుగలో పాల్గొని ఓటు వేయాలి”అని అన్నారు.