ప్రముఖుల ఓట్లు
దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో 96 స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో 96 స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జి. కిషన్ రెడ్డి ఓటు..
కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ ఓటు వేయడమన్నారు. ప్రజలందరూ తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు.
మాధవి లత ఓటు..
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవి లత అమృత విద్యాలయంలో (పోలింగ్ కేంద్రం) ఓటు వేశారు. మీ ఒక్క అడుగు తెలంగాణ మాత్రమే కాకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని.. దీని వల్ల తెలంగాణ అభివృద్ధి చెందడమే కాకుండా ఓటును సద్వినియోగం చేసుకోవడం వల్లే ఇదంతా సాధ్యపడుతుందన్నారు. ప్రతీ ఒక్కరు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ ఓటు..
హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం నుంచి హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చిరంజీవి ఓటు..
సినీనటుడు చిరంజీవి తన కుటుంబంతో సహా జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్ ఓ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఓటు..
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. తనవంతు బాధ్యతగా ఉదయాన్నే ఓటు వేశానని అన్నారు. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అల్లు అర్జున్ ఓటు..
దయచేసి అందరూ ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు చాలా బాధ్యతాయుతమైనదన్నారు. మన భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైన రోజన్నారు. సోమవారం అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరు తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
సాక్షి మహరాజ్ ఓటు..
ఉన్నావ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సాక్షి మహరాజ్ ఉదయాన్నే ఓటు వేశారు.
యూపీ మంత్రి సురేష్ ఖన్నా ఓటు..
యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ఓటు వేశారు. వీడియో డోరేమాన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి వచ్చింది.