ఎన్నికల విధుల్లో అపశృతి గుండెపోటుతో ఏజెంట్​ మృతి

బిహార్​ లోని ముంగర్ లో ఓటింగ్​ కు ముందు అపశృతి చోటు చేసుకుంది.

May 13, 2024 - 09:28
 0
ఎన్నికల విధుల్లో అపశృతి గుండెపోటుతో ఏజెంట్​ మృతి

పాట్నా: బిహార్​ లోని ముంగర్ లో ఓటింగ్​ కు ముందు అపశృతి చోటు చేసుకుంది. శంకర్​ పూర్​ గ్రామంలోని 210 బూత్​ నంబర్​ లో పోలింగ్​ ఏజెంట్​ ఓంకార్​ కుమార్​ చౌదరి విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓంకార్​ గుండెపోటుతో బాధపడుతున్నాడని అతనికి ఎన్నికల విధులు వేయవద్దని అధికారులను కోరామన్నారు. అయినప్పటికీ విధులు వేయడమే గాక అతన్ని ఇబ్బందులకు గురి చేయడంతోనే తట్టుకోలేకే గుండెపోటుతో మృతిచెందాడని బోరున విలపించారు. ఓంకార్​ మృతికి అధికారులే బాధ్యత వహించాలని ఆరోపించారు.