పేద విద్యార్థులకు అండగా బీజేపీ

బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్​

Sep 8, 2024 - 15:57
Sep 8, 2024 - 16:24
 0
పేద విద్యార్థులకు అండగా బీజేపీ
నా తెలంగాణ, బాలాపూర్: పేద విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటానని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ నాదర్ గుల్ 27వ డివిజన్‌లో తెలుగు ఫౌండేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి భవన ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ.. తెలుగు ఫౌండేషన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దే నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. తన, బీజేపీ పార్టీ తరపున పూర్తి అండదండలు ఉన్నాయి. యువత సన్మార్గంలో నడిపించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో మనందరికీ పాత్ర ఉండాలని అందెల శ్రీరాములు యాదవ్  కోరారు. 
 
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి, బడంగ్ పేట్ బీజేపీ మాజీ అధ్యక్షులు నిమ్మల శ్రీకాంత్ గౌడ్, యువ మోర్చా కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్ల గూడెం రామకృష్ణారెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, గాజుల మధు, సహకార బ్యాంక్ డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి, సమస్త సభ్యులు సాయికుమార్, గణేష్ సాగర్ కాలనీవాసులు ఉన్నారు.