హింసామార్గం మానవాళికి ప్రమాదం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ

Sep 21, 2024 - 21:05
 0
హింసామార్గం మానవాళికి ప్రమాదం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హింసామార్గం మానవాళి మనుగడకు ప్రమాదమని, అది ఏ రూపంలో ఉన్నా సమర్థించలేమని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. శనివారం న్యూ ఢిల్లీ రాష్ట్రపతి  భవన్​ లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల హింసాకాండ బాధితులను ముర్మూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఉన్న చిన్న పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. హింసా మార్గంతో సాధించేది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచించి మావోయిలు తమ హింసా మార్గాన్ని విడనాడాలని ప్రభుత్వం వారి సమస్యలను పరిష్​కరించేందుకు సిద్ధంగా ఉందని రాష్​ర్టపతి ముర్మూ కోరారు. జన జీవన స్రవంతిలో శాంతి, సుస్థిరత, దేశాభివృద్ధికి నడుం బిగించాలని అన్నారు. హింసా ప్రవృత్తితో తీవ్ర నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరదని గుర్తెరగాలని రాష్ట్రపతి  ద్రౌపదీ ముర్మూ మావోయిస్టులకు రాష్ర్టపతి భవన్​ వేదికగా విజ్ఞప్తి చేశారు.