నీట్​ రద్దుకు సుప్రీం నో

NEET cancellation supreme no

Jun 11, 2024 - 12:49
 0
నీట్​ రద్దుకు సుప్రీం నో

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీట్ కౌన్సెలింగ్‌ను నిషేధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బీహార్, రాజస్థాన్ పరీక్షా కేంద్రాల్లో తప్పుడు ప్రశ్నపత్రాలు పంపిణీ, గ్రేస్​ మార్కులు ఇవ్వడంలో ఏక పక్ష వ్యవహార ధోరణి, మే 5న జరిగిన పరీక్ష పేపర్​ లీక్​  చేయడం వల్ల దేశ వ్యాప్తంగా వివిధ చోట్ల అవకతవకలు జరిగాయని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. 

కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఆయా విషయాలపై తమకు స్పష్టతనీయాలని నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ)ను ఆదేశించింది. నీట్​ పరీక్షలోని దాఖలైన పిటిషన్​ ల అనుమానాల నివృత్తికై పూర్తి వివరాలు అందజేయాలని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు విక్రమ్​ నాథ్​, అహ్సానుద్దీన్​ అమానుల్లాలతో కూడి బెంజ్​ ఆదేశించింది. వివరాలు అందజేశాక ఈ పిటిషన్​ లపై విచారణ ప్రారంభించనుంది.