డిజిటల్​ చెల్లింపులు రూ. 1,669 లక్షల కోట్లు

ఐదు నెలల గణాంకాలను విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

Sep 21, 2024 - 21:08
 0
డిజిటల్​ చెల్లింపులు రూ. 1,669 లక్షల కోట్లు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో (ఏప్రిల్​, మే, జూన్​, జూలై, ఆగస్ట్) డిజిటల్​ చెల్లింపులు రూ. 1,669 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శనివారం మంత్రిత్వ శాఖ డిజిటల్​ చెల్లింపులకు సంబంధించిన వృద్ధిపై నివేదిక వెల్లడించింది.

చెల్లింపుల పరిమాణం రూ. 8,659 కోట్లకు చేరుకుందని తెలిపింది. 2017–18లో రూ. 2,071 కోట్ల నుంచి 2023–24లో 18,737 కోట్లకు పెరిగిందని తెలిపింది. వార్షిక వృద్ధిని గణిస్తే 44 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. ​ డిజిటల్​ చెల్లింపుల్లో యూపీఐ మూలస్తంభంగా ఉంది. ఎఫ్​ వై 2017–18 ప్రకారం చూసుకుంటే 92 కోట్ల నుంచి 2023–24 ఎఫ్​ వైలో 13,116 కోట్లకు పెరిగింది.

యూపీఐ ద్వారా వేగవంతమైన చెల్లింపులు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. యూపీఐతోబాటు, రూపే ద్వారా కూడా వేగంగా చెల్లింపులు జరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. అదే సమయంలో యూపీఐ ద్వారా యూఏఈ, సింగపూర్​, భూటాన్​, నేపాల్​, శ్రీలంక, ఫ్​రాన్స్​, మారిషస్​ వంటి దేశాల్లో కూడా అంతర్జాతీయ చెల్లింపులు సులభతరం అయ్యాయని పేర్కొన్నారు. ఇది దేశ ఆర్థిక పురోగతిని మరింత వృద్ధి దిశగా తీసుకువెళుతుందని, మెరుగుపరుస్తుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.