విధుల్లోకి వైద్యులు
Doctors on duty
కోల్ కతా: కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాల జూనియర్ వైద్యులు శనివారం అత్యవసర వైద్య విధుల్లో చేరారు. మెడికోపై అత్యాచారం, హత్య అనంతరం రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా 42రోజులపాటు నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించారు. పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు విఫలమైనా, సీఎం మమతా బెనర్జీ ఐదోసారి చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా వారం రోజుల్లో రాష్ర్టంలోని అన్ని కళాశాలలు, ఆసుపత్రుల భద్రత కల్పించే వరకు అత్యవసర వైద్యసేవల్లో మాత్రమే పాల్గొంటామన్నారు. భద్రత కల్పించాక రోజు వారి విధుల్లో చేరతామని ప్రకటించారు. ఇందుకు రాష్ర్ట ప్రభుత్వం కూడా సమ్మతించడంతో వైద్యులు విధుల్లో చేరారు.