ట్రూడో కపటబుద్ధి తూర్పారబడుతున్ననెటీజన్లు

Netizens are being exposed for Trudeau's hypocrisy

Jun 6, 2024 - 14:25
 0
ట్రూడో కపటబుద్ధి తూర్పారబడుతున్ననెటీజన్లు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిస్​ ట్రూడో  కపటబుద్ధి అభినందనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ట్రోలింగ్​ అవుతోంది. ట్రూడోను తిట్టి పోస్తున్నారు. ఆయన మరోమారు తన కపట బుద్ధిని చాటుకున్నారనే విమర్శలే సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండడం విశేషం. పీఎం మోదీ, బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ట్రూడో గురువారం స్పందించారు. మోదీని అభినందిస్తూనే మరోవైపు మానవ హక్కులు, వైవిధ్యం, చట్టం నియమ నిబంధనలు పాటించాలని ఉచిత సలహాలిచ్చారు. ఈ సందేశం అనంతరం జస్టిస్​ ట్రూడోను నెటీజన్లు తూర్పారబడుతున్నారు. గతంలో భారత్​ వెంట అనుచితంగా ప్రవర్తించి ఇప్పుడు మోదీ గెలవగానే దారికొచ్చారా? అని ప్రశ్నించారు. దారికొచ్చారనుకుంటే ఉచిత సలహాలెందుకో? అని ప్రశ్నించారు. కెనడా వాసుల ఆకాంక్షలను ట్రూడో పరిగణనలోకి తీసుకోకుండా విదేశాలతో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.