కాంగ్రెస్ కు మంత్రి రాజీనామా
అసెంబ్లీ నుంచి 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్
డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి విక్రమాదిత్య సింగ్ బుధవారం రాజీనామా చేశారు. దీంతో హిమాచల్ లో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తన తడ్రి వీరభద్ర సింగ్ కు రాష్ర్ట ప్రభుత్వం సరైన నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ర్ట ప్రభుత్వం తనతోపాటు ఉన్న కార్యకర్తలు, నాయకులకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, వీరభద్ర సింగ్ ల కుటుంబాలకు మధ్య పడదని ఇరు పార్టీ వర్గాల నేతలు వెల్లడించారు. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ సీఎం కావాలనుకున్నా, కాంగ్రెస్ అధిష్టానం వీరి ఆశలపై నీల్లు జల్లి సుఖును సీఎంగా ఎంపిక చేసింది. తన రాజీనామాకు ముందు పార్టీ అధిష్టాన నేతలతో మాట్లాడానన్నారు. వారు తమ బాధలు చెప్పుకుంటే పరిశీలిస్తామని అనడం తనకు రుచించలేదన్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ నేతల నినాదాల కారణంగా స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు జై రామ్ ఠాకూర్ సహా 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ వాయిదా పడింది.