బీరూట్​ కకావికలం హిజ్బుల్లాపై భారీ దాడి

Beirut Kakavikalm is a huge attack on Hezbollah

Oct 6, 2024 - 13:27
 0
బీరూట్​ కకావికలం హిజ్బుల్లాపై భారీ దాడి

440 మంది మృతి
ఐడీఎఫ్​ ప్రకటన
పగలు డ్రోన్​ లతో రెక్కీ, అర్థరాత్రి దాడులు
ఇజ్రాయెల్ దాడులతో హిజ్బుల్లా కంచుకోట దహియా నేలమట్టం

బీరూట్​: లెబనాన్​ లోని హిజ్బుల్లా స్థావరాలపై శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఐడీఎఫ్​ భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 440మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రకటించింది. ఇజ్రాయెల్​ హిజ్బుల్లాను ఎదుర్కోవడంలో అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది. ఉగ్రస్థావరాలను కనుగొనేందుకు పగలంతా ఎవ్వరికీ కనిపించని విధంగా ఆకాశంలో అత్యాధునిక కెమెరాలతో కూడిన డ్రోన్​ లను తిప్పుతోంది. దీని ఆధారంగా ఎవ్వరిచేతుల్లోనైనా తుపాకులు, బాంబులు లాంటివి కనిపిస్తే వాటిని అనుసరించి టార్గెట్​ ను లాక్​ చేసుకుంటోంది. లాక్​ చేసిన టార్గెట్​ పై అర్థరాత్రి దాడులకు పాల్పడుతోంది. ఇప్పటివరకూ జరిపిన దాడుల్లో 2000 హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేశామని ఐడీఎఫ్​ ప్రకటించింది. దాడుల సందర్భంగా భారీ శబ్ధాలతో బీరూట్​ నగరం వణికిపోయింది. ఆకాశం నల్లటి పొగలు, మంటలతో కమ్మింది. ఈ దాడిలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. బీరూట్​ లో దక్షిణాన ఉన్న ప్రాంతం దహియా హిజ్బుల్లాకు కంచుకోటగా భావిస్తారు. ఈ ప్రాంతాన్ని ఐడీఎప్​ నామరూపాల్లేకుండా చేస్తోంది.