విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
కాంగ్రెస్ పై మండిపడ్డ మంత్రి అనురాగ్
డెహ్రాడూన్: హిమాచల్ రాజకీయాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. కాంగ్రెస్ పై మండిపడ్డారు. సొంత పార్టీ అభ్యర్థులను అదుపులో పెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. హిమాచల్ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలపై బుధవారం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. తప్పు డు హామీలు, వాగ్ధానాలు ఇస్తూ ప్రజా సమస్యలను పక్కకు నెడితే ఉత్పన్నం అయ్యే పరిణామాలు ఇలాగే ఉంటాయన్నారు. అధికారాన్ని ఇచ్చిన ప్రజల వద్దకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ వెళ్లిన పాపాన పోలేదన్నారు. వారి నాయకత్వాన్ని బలపర్చుకోలేదన్నారు. కాగా వీరభద్ర సింగ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారా? అనే ప్రశ్నకు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కాలమే సమాధానం చెబుతుందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని 68 సీట్లలో కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25 ఉన్నాయి. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రులు ఉన్నారు.