నా తెలంగాణ, మంచిర్యాల: మంచిర్యాల మీదుగా ప్రారంభం కానున్న నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో హాల్టింగ్ ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. శనివారం మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ మోమరాండం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, గనులు ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు, కోల్ బెల్ట్ ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ ట్రైన్ ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలిందర్ ఆలీ ఖాన్, జోగుల మల్లయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, కుంచాల శంకరయ్య, కోడి వెంకటేశం రాయమల్లు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.