క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలం పట్టివేత
విలువ రూ.43 లక్షలు వివరాలు వెల్లడిచిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ లో రూ. 43 లక్షల అల్ప్రాజోలం, క్లోరల్ హైడ్రేట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, ఎస్టీఎఫ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ద్వారకనగర్, శాంతినగర్ ప్రాంతంలో ఓ గోదాంలో ఈ మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో దాడులు నిర్వహించామని తెలిపారు. 26 సంచుల్లో 728 కిలోల క్లోరల్ హైడ్రేట్, 3.3 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ కు సోలాపూర్ శ్రీను, రాజస్థాన్ కు చెందిన రూప్ సింగ్ లు ఈ మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.