ఆయుష్మాన్ భారత్ పథకం వృద్ధులకు మేలు

బిజెపి జిల్లా అధ్యక్షురాలు - గోదావరి అంజిరెడ్డి 

Sep 14, 2024 - 18:08
 0
ఆయుష్మాన్ భారత్ పథకం వృద్ధులకు మేలు
 నా తెలంగాణ, సంగారెడ్డి: ఆయుష్మాన్ భారత్ పథకంతో దేశంలోని వృద్ధులకు మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అంజి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీ కి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు రూ 5 లక్షల ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి హర్షిస్తున్నామన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రా,వు కౌన్సిలర్  నాగరాజ్, కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు  ప్రవీణ్ యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ద్వారక రవి,  శ్రీకాంత్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, మీనా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రాములు, మల్లేశం, బాలరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.