బిట్​ కాయిన్​ మోసం.. ముగ్గురి అరెస్ట్​

ఎస్పీ జానక షర్మిల

Sep 25, 2024 - 20:57
 0
బిట్​ కాయిన్​ మోసం.. ముగ్గురి అరెస్ట్​
మొత్తం 8మంది అరెస్టు, 11 ఖాతాలు సీజ్​ 
మోసాలపై అప్రమత్తత అవసరం
పోలీసులకు అభినందనలు
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ యు బిట్ కాయిన్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో 11 బ్యాంక్​ ఖాతాలను స్తంభింప చేశామన్నారు. గతంలో అరెస్టు చేసిన ఐదుగురు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. ఈ మేరకు కడెం మండలం కన్నాపూర్​ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసరి రమేష్​, బోథ్​ మండలం సోనాల ఉపాధ్యాయుడు బి. ధనుంజయ్​, మామడ మండలం ధంజి నాయక్​ తండా ఉపాధ్యాయుడు కిరం వెంకటేష్​ గౌడ్​లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరంతా పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించారని తెలిపారు. 
 
ఈ పథకం మొత్తం వెనుక ప్రధాన కుట్రదారుడు బ్రిజ్​ మోహ్​ సింగ్​ అని వెలుగులోకొచ్చిందని తెలిపారు. క్రిప్టో కరెన్స పేరిట పెట్టుబడిదారులను మోసం చేయడే వీరి లక్ష్​యమని పేర్కొన్నారు. వీరి ఖాతాలను ఎప్పటికప్పుడు ట్రాక్​ చేస్తూ 11 ఖాతాలను స్తంభింపచేశామని తెలిపారు. బాధితుల సొమ్ముకు భద్రత కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు వివిధ దర్యాప్తు సంస్థల సహాకారం కూడా తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులు ఇలాంటి పథకాలకు ఆకర్షణకు గురి కావొద్దని ఒకవేళ మోస పోయామని అనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. 
 
ఈ కేసును చేధించేందుకు కృషి చేసిన భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్సై లు లింబాద్రి,  దేవేందర్, ఎం. రవి, సాయి కృష్ణ, గౌస్ లను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.